చిరు, చరణ్‌తో త్రివిక్రమ్ ఇంటర్వ్యూ

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి, సైరా నిర్మాత రాంచరణ్‌లను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తున్నాయి.

తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ఈ నెల రెండున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు, చరణ్‌లను త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. త్రివిక్రమ్ ఇంటర్వ్యూ రికార్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబందించిన ఫోటోలను రామ్ చరణ్‌కు చెందిన కొణిదెన ప్రొడక్షన్ సంస్థ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.