NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ ఏకంగా ఐదు కోట్లు ఖర్చు..!!

Share

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “NBK 108” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. కుర్ర హీరోయిన్ శ్రీ లీల కూడా.. కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలంగాణ యాసలో బాలకృష్ణ డైలాగులు పలకబోతున్నారు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తరహాలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఇందులో పుష్కలంగా ఉండనుందట.

Special song in Anil Ravipudi Balakrishna's movie cost five crores

బాలకృష్ణ క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది కానీ ఆయన చుట్టుప్రక్కల పాత్రలు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే రీతిలో అనిల్ రావిపూడి సినిమా రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా దసరా పండుగ నాడు రిలీజ్ అవుతుందని ఇటీవల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించడం జరిగింది. కాక తాజాగా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ రూపొందించడం జరిగిందంట. ఈ సాంగ్ కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక స్పెషల్ సెట్ వేశారట. గణేశుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీ లీలతో ఈ సెట్ లోనే గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారట.

Special song in Anil Ravipudi Balakrishna's movie cost five crores

ఇప్పటివరకు బాలకృష్ణ కెరియర్ లో అత్యధికంగా ఖర్చుతో కుడిన సాంగ్ ఇదే అని.. మేకర్స్ అంటున్నారు. మే నెలలో బాలకృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో గ్లింప్స్ రిలీజ్ చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో “వీరసింహారెడ్డితో బాలయ్య అదిరిపోయే హిట్ ఖాతాలో వేసుకున్నాడు. మరి ఈ సినిమాతో ఏ స్థాయి విజయం బాలకృష్ణ అందుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

కాజల్ అగర్వాల్ ఈ సినిమా ఒప్పుకొని ఎంత పెద్ద పొరపాటు చేయబోతుందో ..?

GRK

Anu Kreethy Vas New Wallpapers

Gallery Desk

హ‌న్సిక సంచ‌ల‌న నిర్ణ‌యం.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్ త‌ట్టుకోలేరు!?

kavya N