లూసిఫర్ రీమేక్ గా తెలుగులో గాడ్ ఫాదర్ వస్తున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ నాడు విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. సినిమాలో చివరి సాంగ్ చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో చిరంజీవి స్టెప్పులు వేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పర్యవేక్షణలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా తెలియజేశారు. నాకు 16 సంవత్సరాల తర్వాత ప్రభుదేవా పర్యవేక్షణ సినిమాకి కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ మాఫియా లీడర్ గా నటించినట్లు టాక్. ఇదే సినిమాలో చాలాకాలాం తర్వాత చిరంజీవి పక్కన సునీల్ నటించడం జరిగింది. నయనతార కూడా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఒక చిన్నపాటి గెస్ట్ రోల్ చేయడం జరిగింది. ఇటీవల “గాడ్ ఫాదర్” సినిమా కి సంబంధించి చిన్న పాటి ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో.. “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించి చిరంజీవి ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇక వచ్చే నెల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా “గాడ్ ఫాదర్” మూవీ నుండి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ ఒక్క సాంగ్ షూటింగ్ మినహా.. మొత్తం షూటింగ్ కంప్లీట్ కావడం జరిగిందంట. దీంతో నెక్స్ట్ సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.