NewsOrbit
Entertainment News సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” ని పొగడ్తలతో ముంచేతిన స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్..!!

Advertisements
Share

RRR: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ప్రపంచ సినిమా రంగంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆ తరువాత పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ ఏడాది మార్చి నెలలో ప్రపంచ సినీ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించటం జరిగింది. ఆస్కార్ నామినేషన్ కి “RRR” ఎంపికైన సమయంలో… చాలా స్పెషల్ షోస్ అంతర్జాతీయ సినిమా సెలబ్రిటీలకు వేయడం జరిగింది.

Advertisements

Spider man hero Tom Holland showered RRR with praises

ఈ క్రమంలో “RRR” చూసిన చాలామంది రాజమౌళి పనితనాన్ని మెచ్చుకోవటం జరిగింది. ప్రపంచ బెస్ట్ డైరెక్టర్ లలో ఒకరైన జేమ్స్ కామెరూన్ సైతం జక్కన్నతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ గా మీడియా సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా స్పైడర్ మ్యాన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో టామ్ హాలండ్ సైతం “RRR” పై పొగడ్తల వర్షం కురిపించారు. విషయంలోకి వెళ్తే ఇటీవల ముంబాయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి టామ్ హాలండ్ ఇండియా వచ్చారు.

Advertisements

Spider man hero Tom Holland showered RRR with praises

మూడు రోజులపాటు ఇక్కడే పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టామ్ హాలండ్ “RRR” సినిమా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా తెరకెక్కించారు అని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న హీరో టామ్ హాలండ్ పొగడటంతో… ప్రపంచ సినిమా రంగంలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో తన కెరియర్ లో భారత్ పర్యటన మర్చిపోలేనిదని అన్నారు. మూడు రోజులలో ఎంతో మంది ప్రముఖులను కలవడం జరిగింది. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నీతూ అంబానీ బృందం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని టామ్ హాలండ్ తన ఆనందం వ్యక్తం చేశారు.


Share
Advertisements

Related posts

అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ పడిచస్తారు, చనిపోయిన వ్యక్తి కోసం ఏం చేశారో చూడండి..!!

sekhar

సెన్సార్ కి సిద్ధమైన “దోషం” (నాకా…!దేవుడికా..?)

Siva Prasad

Devatha Serial: రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్తువెళ్తూ చాలా విలువైనది తీసుకెళ్లిందన్న ఆదిత్య..! అదేంటని ప్రశ్నించిన సత్య..!!

bharani jella