Harika – Narayan : సింగర్ హారిక నారాయణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె పాడిన ‘లాహే లాహే లాహే లాహే’.. ఎక్కడ చూసినా మనకిదే వినబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “ఆచార్య” సినిమాలోని ఈ పాటను హారికా నారాయణ్ ఎంతో అద్భుతంగా పాడారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టమున్న హారిక కర్ణాటక సంగీతం నేర్చుకొని ఈటీవీలో ప్రసారమవుతున్న స్వరాభిషేకం ద్వారా సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్నో సినిమాలలో ప్లేబ్యాక్ సింగర్ గా అవకాశాలు దక్కించుకున్న హారిక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ప్రముఖ సంగీత విద్వాంసుడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువే హారికా నారాయణ్. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన హారిక కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉండేది. అయితే తెలుగు పాటల పై పెద్దగా ఆసక్తి లేకపోయినా కన్నడ సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడే హారిక ఒక రోజు ఈటీవీలో ప్రసారమవుతున్న స్వరాభిషేకం ఆడిషన్స్ కి వెళ్లి పాల్గొన్నారు. అనంతరం స్వరాభిషేకంలో కొరస్ సింగర్ గా పాటలు పాడారు. హారిక పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా రాజోలులో అయినప్పటికీ తండ్రి ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వహించడంతో ఆమె ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలలోనే పెరిగారు.
హారికా నారాయణ్ సింగర్ మాత్రమే కాదు:
హారిక మొట్టమొదటిసారిగా నిహారిక నటించిన “సూర్యకాంతం” సినిమాలో ప్లే బ్యాక్ సింగర్ గా పాడారు.విభిన్నమైన గాత్రంతో ఎంతో మంది సినీ ప్రియులను ఆకట్టుకునే హారిక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రాలలో పాటలను పాడారు. హారిక కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాలో మొదటిసారిగా తెరపై కనిపించారు. అదే విధంగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు మరదలు పాత్రలో నటించారు.అదేవిధంగా చిరంజీవి సైరా సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో తళుక్కుమన్నారు. నటిగా పలు సినిమాలలో అవకాశం వస్తున్నప్పటికీ ఈమె మాత్రం సింగర్ గాని కొనసాగాలి అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!