చేజారి పొయే….

Share


శ్ర‌ద్ధాక‌పూర్‌కు అంతా బాగానే ఉంది క‌దా… అని అనుకుంటున్న త‌రుణంలో షాక్ త‌గిలింది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్‌కు పేరు ప్ర‌తిష్ట‌లు తీసుకొచ్చిన ప్లేయ‌ర్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌లో ముందుగా శ్ర‌ద్ధాక‌పూర్‌ను ఎంపిక చేశారు. అయితే ఆమెకు అనుకోకుండా డెంగీ జ్వ‌రం సోక‌డంతో ఆమెను ప్రాజెక్ట్ నుండి త‌ప్పించారు. ఆమె స్థానంలో ప‌రిణీతి చోప్రాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ టి సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్ తెలిపారు. సైనా బ‌యోపిక్‌లోకి ప‌రిణీతి చోప్రాకు స్వాగ‌తం అని అన్నారు. అయితే ఇప్ప‌టికే సైనాగా శ్ర‌ద్ధాక‌పూర్ లుక్ విడుద‌ల చేశారు. సినిమాను 2020లో విడుద‌ల చేయాల‌నుకున్నారు. ఇప్పుడు మ‌రి ప‌రిణీతిని ఎందుకు తీసుకోవాల్సి వ‌చ్చిందో తెలియ‌డం లేదు. అయితే.. శ్ర‌ద్దాక‌పూర్ డెంగీ నుండి కోలుకుంది క‌దా.. డెంగీ కార‌ణంగా శ్ర‌ద్ధాను త‌ప్పించార‌న‌డం పై వ‌స్తున్న కార‌ణాలు స‌బబుగా లేవు. ఇప్పుడు ఆమెను ఎందుకు మార్చారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగ‌క త‌ప్ప‌దు.


Share

Related posts

Mirnalini Ravi Cute Stills

Gallery Desk

`ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం` టైటిల్‌ పోస్ట‌ర్‌ విడుద‌లచేసిన  నిర్మాత రాజ్‌కందుకూరి

Siva Prasad

‘సైరా’ ఆత్మీయ సత్కార సభ

Siva Prasad

Leave a Comment