నమ్మకంతో మనస్ఫూర్తిగా చేసిన ఏ పని అయినా గొప్ప ఫలితాన్నిస్తుందనడానికి నేనే సాక్ష్యం అని అంటున్నారు శ్రద్ధ శ్రీనాథ్. `జెర్సీ` ప్రీ రిలీజ్ వేడుకలో `నా పేరు శ్రద్ధా.. నన్ను గుర్తుపెట్టుకోండి` అని పదే పదే చెప్పిన శ్రద్ధా ఇప్పుడు నిజంగానే ప్రేక్షకులందరికీ సారా పాత్ర ద్వారా గుర్తుండిపోయింది. తెలుగులో తొలి సినిమా నానితో చేసిన శ్రద్ధా , ఇప్పుడు నాగచైతన్య సినిమాకు సంతకం చేసిందని టాక్. నాగచైతన్య హీరోగా దిల్రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అర్బన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇందులో శ్రద్ధ పాత్ర టిపికల్ కమర్షియల్ హీరోయిన్గా ఉండనుంది. ఎలాంటి కాస్ట్యూమ్స్ కి అయినా సూట్ అయ్యే పర్సనాలిటీ, ఎమోషన్స్ ను పలికించగలిగే ఫేస్ వంటివన్నీ ఆమె ప్లస్ పాయింట్స్ అని ఇప్పుడు టాలీవుడ్లో టాక్. పైగా తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన గోల్డెన్ లెగ్గానూ అందరూ ఆమెను అభిమానిస్తున్నారు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!