Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరిగ్గా చిరంజీవి రాజకీయాల్లోకి అరంగేట్రం చేయకముందు.. శ్రీజ వార్తల్లో నిలిచింది. ఆమె మొదటి భర్త భరద్వాజ్ తో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘటనతో మెగాస్టార్ చిరంజీవిని అప్పట్లో రాజకీయంగా అనేకమంది నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత భరద్వాజతో విడాకులు తీసుకున్న.. శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకోవడం జరిగింది.
అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చినట్లు దూరంగా ఉంటున్నట్లు గత ఏడాది మొత్తం వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే కొత్త ఏడాది సందర్భంగా గత ఏడాది జరిగిన మూమెంట్స్.. షేర్ చేస్తూ… శ్రీజ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. “డియర్ 2022, నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేశావు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి ఇంకా నన్ను ఎంతగానో అమితంగా ప్రేమించి… జాగ్రత్తలు చూసుకుంటూ కష్టసుఖాల్లో నాకు తోడుండే వ్యక్తి… ఎప్పుడూ నాకు మద్దతుగా నిలబడే వ్యక్తి తనను కలుసుకోవడం అద్భుతం.
కొత్త ప్రయాణం మళ్లీ మొదలవుతుంది అంటూ… ఇంటరెస్టింగ్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ లు కలిసి ఒక్కసారి కూడా పెద్దగా కనిపించలేదు. కూతురు బర్త్ డే వేడుక కూడా.. శ్రీజ ఒక్కతే సెలబ్రేట్ చేయడం జరిగింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆరంభంలోనే కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నాను అంటూ l కళ్యాణ్ దేవ్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి శ్రీజ వెల్లడించడం సంచలనంగా మారింది.