Sreeja Konidela: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గత కొద్ది రోజుల నుంచీ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 2007లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని తండ్రి చిరంజీవి ఎదిరించి మరీ శ్రీజ వివాహం చేసుకుంది. అయితే వీరికి నివృతి అనే కుమార్తె పుట్టిన అనంతరం భేదాభిప్రాయాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ నెక్ట్స్ 2016లో చిరంజీవి శ్రీజను కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి పెళ్లి చేశారు.
ఈ దంపతులు నివిక్షకు జన్మ నిచ్చారు. అయితే గత కొన్ని నెలలుగా కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేరులో `కళ్యాణ్`ని తొలగించి కొణిదెల అని యాడ్ చేసింది శ్రీజ. అప్పటి నుంచీ వీరి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.
పైగా శ్రీజ సోషల్ మీడియా వేదికగా తరచూ పెడుతున్న విచిత్రమైన పోస్ట్‌లు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక తాజాగా కూడా శ్రీజ మరో సంచలన పోస్ట్ పెట్టింది. `మనం అవతలి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే వంద రెట్లు మనకు తిరిగి వస్తుంది` అంటూ ఓ కొటేషన్‌ను షేర్ చేసింది.
దాంతో శ్రీజ మళ్లీ వార్తల్లో నిలిచింది. అసలు ఉన్నట్టుంది శ్రీజ ఈ పోస్ట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటీ..? ఆమె టార్గెట్ ఎవరు..? నిజంగానే శ్రీజ కళ్యాణ్ తో విడిపోయిందా..? అతడిని ఉద్దేశించే అలా పోస్ట్ పెట్టిందా..? అంటూ నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!