Sreeleela: కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న `పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ శ్రీలీల.. మొదటి మూవీతోనే తన అందం, అభినయం మరియు చలాకీతనంతో ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో ఇప్పుడీ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజ్ రవితేజ సరసన `ధమాకా` మూవీలో శ్రీలీల నటిస్తోంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీలకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నితిన్ హీరోగా ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ ఓ సినిమా రూపొందిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
ఠాగూర్ మధు నిర్మాణంలో గ్రాండ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు `జూనియర్` అనే టైటిల్ పరిశీలనతో ఉంది. అయితే ఇందులో నితిన్‌కు జోడీగా శ్రీలీలను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట.
ఇందులో భాగంగా ఆమె సంప్రదించి స్టోరీ లైన్ వినిపించగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.