Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన `పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్‌లో సూపర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా అనంతరం వరుస ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో.. శ్రీలీల తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ సరసన `ధమాకా` అనే సినిమా చేస్తోంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి త్వరలోనే తెరకెక్కించబోయే `ఎన్బీకే 108`లో బాలయ్య కూతురిగా శ్రీలీల అలరించబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వీటితో పాటు మరో రెండు, మూడు ప్రాజెక్ట్స్‌కు కూడా శ్రీలీల చేతిలో ఉండగా.. ఇప్పుడు మరో ఆఫర్ ఆమె తలుపు తట్టేలా కనిపిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగచైతన్య `మానాడు` ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.తెలుగు, తమిళ భాషల్లో ఏకాకాలంలో రూపొందబోయే ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.
జూలై లేదా ఆగస్టు నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా శ్రీలీల లేదా సాక్షి వైద్యలలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. శ్రీలీల `పెళ్లి సందD` తో గుర్తింపు తెచ్చుకోగా.. సాక్షి త్వరలోనే `ఏజెంట్`తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే వీరిద్దరూ చైతు సరసన బాగా సెట్ అవుతారట. అందుకే వీరిలో ఒకరిని ఫైనెల్ చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే అక్కినేని హీరోతో జతకట్టే ఛాన్స్ శ్రీలీలకు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!