NewsOrbit
Entertainment News సినిమా

SreeLeela: మహేష్, పవన్ లపై ప్రశ్నలకు చాలా తెలివిగా తప్పించుకున్న శ్రీ లీల..!!

Share

SreeLeela: తెలుగు చలనచిత్ర రంగంలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ శ్రీ లీల. 2021లో “పెళ్లి సందD” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. కేవలం రెండే రెండు సంవత్సరాలలో టాప్ హీరోల సరసన అవకాశాలు అందుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం షూటింగులు జరుపుకుంటున్న అనేక పెద్ద సినిమాలలో శ్రీ లీల హీరోయిన్ పాత్రలు చేస్తున్న సినిమాలే ఎక్కువ. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన “భగవంత్ కేసరి” మూవీలో కీలక పాత్ర చేసింది.

SreeLeela very cleverly dodged questions on Mahesh Pawan

దసరా పండుగ కానుకగా విడుదలైన “భగవంత్ కేసరి” భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వైష్ణవ్ తేజ్ సరసన “ఆదికేశవ” సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా నవంబర్ 24వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్న క్రమంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలకు కష్టమైన ప్రశ్న ఎదురయ్యింది. మేటర్ లోకి వెళ్తే హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్”, అదేవిధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “గుంటూరు కారం”.. ఈ రెండు సినిమాలలో శ్రీలీల హీరోయిన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

SreeLeela very cleverly dodged questions on Mahesh Pawan

ఈ సందర్భంగా సంగీత్ శోభన్ ఇంటర్వ్యూ చేస్తూ పవన్ కళ్యాణ్, మహేష్ వీరిద్దరిలో మీ మొదటి ఛాయిస్ ఎవరు అనే చిక్కు ప్రశ్న వేయడం జరిగింది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా తప్పించుకుని “ఆదికేశవ” సినిమా ఈనెల 24న విడుదల కాబోతోంది. అందరూ థియేటర్లో చూసి బాగా ఎంజాయ్ చేయండి. సినిమా అద్భుతంగా ఉంటుంది..అంటూ ప్రశ్నను దాటివేసింది. దీంతో ఒకవేళ ఆ ప్రశ్నకు శ్రీ లీల జవాబు చెప్పి ఉంటే.. ఆ ఇద్ద హీరోల ఫ్యాన్స్ లలో.. ఎవరో ఒకరి అభిమానులకి గట్టిగా టార్గెట్ అయ్యేది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ అంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ పరంగా పవన్ వర్సెస్ మహేష్ అన్న రీతిలో ఫాలోయింగ్. కాబట్టి ఈ ప్రశ్నకు శ్రీ లీలా జవాబు చెప్పకుండా తప్పించుకోవటంతో సేవ్ అయిపోయింది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.


Share

Related posts

Brahmastra: తెలుగు లో తన ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్పేసిన రణబీర్ కపూర్..!!

sekhar

VJ Maheswari Beautiful Stills

Gallery Desk

Krishna Mukunda Murari: కృష్ణ దే పై చేయి.. మురారి ముకుంద విషయంలో ఓ కన్నేసిన రేవతి..

bharani jella