సినిమా

Sreemukhi: పెళ్లిపై బిగ్ స్టేట్‌మెంట్.. వామ్మో శ్రీ‌ముఖి అలా అందేంటి..?

Share

Sreemukhi: ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీ‌ముఖి అంటే తెలియ‌ని బుల్లితెర ప్రేక్ష‌కులు ఉండ‌రు. `అదుర్స్` అనే డ్యాన్స్ షోతో వ్యాఖ్యాతగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత మ‌రిన్ని షోల ద్వారా ప్రేక్ష‌కులు ద‌గ్గ‌రైంది. అలాగే ప‌లు సినిమాల్లోనూ స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషించిన శ్రీ‌ముఖి.. గ్లామ‌ర్ షోతోనూ ఎప్ప‌టిక‌ప్పుడు హ‌డావుడి చేస్తుంది.

ప్ర‌స్తుతం ఓవైపు టీవీ షోలు, మ‌రోవైపు సినిమాలు చేస్తూ మ‌స్తు బిజీగా గ‌డుపుతున్న శ్రీ‌ముఖి.. తాజాగా కాస్త ఫ్రీ టైమ్ దొర‌క‌డంతో త‌న ఫాలోవ‌ర్స్‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా చిట్ చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్ల అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చింది. అలాగే పెళ్లిపై బిగ్ స్టేట‌మెంట్ కూడా ఇచ్చింది.

అస‌లేమైందంటే.. ఓ నెటిజ‌న్ `పెళ్లెప్పుడు చేసుకుంటారు..?` అని ప్ర‌శ్నించాడు. అందుకు శ్రీ‌ముఖి `ఏమో సార్ నాకు ఇంట్రెస్ట్ పోయింది` అని వీడియో షేర్ చేశారు. పెళ్లిపై ఇంట్రెస్ట్ పోవ‌డం ఏంటీ..? శ్రీ‌ముఖి అలా అందేంటి..? ఆమె సరదాగా చెప్పింది? లేదంటే నిజంగా అందా? అంటూ ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

ఇక ఈ చిట్ చాట్ సెష‌న్‌లో `మీ ఫేవరెట్ హీరో ఎవరు?` ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఆమె చిరంజీవి అని పేర్కొంది. అలాగే చిరంజీవి గారితో `భోళా శంకర్` సినిమాతో క‌లిసే న‌టించే అవ‌కాశం రావ‌డం త‌న అదృష్టం అని పేర్కొంది. కాగా, మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తే, హీరోయిన్‌గా త‌మ‌న్నా మెర‌వ‌బోతోంది. అలాగే ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం శ్రీ‌ముఖిని ఎంపిక చేశారు.


Share

Related posts

Deepika Padukone: రెడ్ కార్పెట్ పై రెడ్ డ్రెస్ ధరించి, ఆహుతులకు కనువిందు చేసిన దీపిక పదుకొనె!

Ram

Devatha Serial: దేవిని కలవడానికి వచ్చిన ఆదిత్యని ఘోరంగా అవమానించిన మాధవ్..రాధ ఏం చేసిందంటే.!

bharani jella

Intinti Gruhalakshmi: గాల్లో తేలుతున్న తులసి..! పాతాళానికి పడిపోయిన నందు..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar