Sri Leela: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది.. శ్రీల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకుల కు దగ్గర అయింది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడు వరుస సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది.. పెళ్లి సందD సినిమా తర్వాత ధమాకాతో కలిపి మొత్తం ఆరు సినిమాలకి శ్రీలీల సంతకం చేసింది. ఇందులో ధమాకా ఇప్పటికే విడుదలై హిట్ అయ్యింది.. ఇక ఆ తరువాత చేస్తున్న సినిమాలలో మహేష్ సినిమా కూడా ఒకటి ఉంది.. తాజాగా మహేష్ సినిమాను శ్రీలిల నో చెప్పిందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఇక నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నటించబోతున్న శ్రీలీల, రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలానే నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. దాంతో SSMB28 షూటింగ్ వాయిదా కారణంగా శ్రీలీల ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడిందట. దాంతో మహేష్ బాబు సినిమా నుంచి ఈ యంగ్ హీరోయిన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి మహేష్ బాబుతో సినిమా అనేది ఈతరం హీరోయిన్ల కల. అది కూడా అప్‌కమింగ్ హీరోయిన్స్ అయితే ఆ ఛాన్స్‌ని అస్సలు వదులుకోరు. అయితే SSMB28 మూవీలో పూజా హెగ్డే ఉండటంతో శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా గత ఏడాది ఎంపికైంది. కానీ ఇప్పుడు శ్రీలీల టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీ లీల మొదట్లోనే ఇంత డేరింగ్ స్టెప్ వేసినందుకు ఆమెను మెచ్చుకోవాలో లేదంటే.. మహేష్ తో సున్నితంగా వ్యవహరించి ఈ సినిమా నుంచి తప్పుకున్నందుకు మెచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో డైరెక్టర్స్ ఉన్నారట.