Vijay Deverakonda: తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు కొన్ని దశాబ్దాల నుండి ఉత్తరాది ప్రాంతానికి చెందిన హీరోయిన్స్ టైం నడిచేది. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్.. ఇంకా చాలామంది ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాళ్లకే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. లేకపోతే దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలకు చెందిన సమంత, సాయి పల్లవి, అనుష్క వంటి వాళ్లకు అవకాశాలు వచ్చాయి. దాదాపు వీళ్లే కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ పొజిషన్ లలో రాణించేవారు. అయితే ఇప్పుడు గతానికి భిన్నంగా టైం స్టార్ట్ అయింది. తెలుగమ్మాయి శ్రీ లీల టైం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలలో సగానికి పైగా శ్రీ లీల చేతిలో ఉన్నాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో సినిమా, పవన్ సాయి ధరంతేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా, అదేవిధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ప్రాజెక్ట్ లో అవకాశాలు అందుకోవటం జరిగింది. కాగా ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో కూడా అవకాశం అందుకున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే గౌతమ్ తిననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సితార బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. “ఖుషి” తర్వాత ఈ సినిమా విజయ్ దేవరకొండ స్టార్ట్ చేయనున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ అని త్వరలో అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “పెళ్లి సందడి” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల వరుస పెట్టే విజయాలు సాధిస్తూ ఉంది. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ నటించిన “ధమాకా” తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. తెలుగు అమ్మాయి కావటంతో పాటు మంచి టాలెంట్ అందం ఉండటంతో… టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.