Sri Reddy : కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా మాట్లాడుతూ ఎంతో ఫేమస్ అయిన శ్రీ రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఈ విధంగా వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా ఈమె ట్విట్టర్ వేదికగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి… ఎన్టీఆర్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మెగా అభిమానులు ప్రస్తుత శ్రీ రెడ్డిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
శ్రీ రెడ్డి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేయడంతో మెగా అభిమానులందరూ శ్రీరెడ్డి ఎందుకు మెగాస్టార్ మీద పడింది ?అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. తాజాగా చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల కావడంతో ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అయితే ఆచార్య టీజర్ గురించి శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆచార్య ట్రైలర్ గురించి మాట్లాడుతూ..”ఆచార్య సినిమా కథ ఏమిటో నాకు తెలిసిపోయింది. ఇందులో చిరంజీవి ఏదో ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి అక్కడ ప్రజలను కష్టాల నుంచి కాపాడి వారికి దేవుడు లాగా కనిపిస్తాడు. “అంటూ ఆచార్య సినిమా ట్రైలర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య పోలికలు పెట్టి డైలాగు చెప్పే విషయంలో ఎన్టీఆర్ ని పొగుడుతూ చిరంజీవిని ఎద్దేవా చేశారు.
“అబ్బే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటనముందు మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం సరిపోడు. ఆచార్య సినిమా ట్రైలర్లు డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు”అంటూ శ్రీరెడ్డి మరొక ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు శ్రీ రెడ్డి పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రెడ్డి చేసిన మెగాస్టార్ ట్వీట్స్ పై స్పందించిన మెగా అభిమానులు నువ్వే ఎంత అరిచినా నీకు లీడ్ రోల్ ఇవ్వరు. ఎందుకివ్వరు తప్పకుండా బ్లూ ఫిలిమ్స్ లో ఇస్తారు అంటూ.. మరికొందరు శ్రీ రెడ్డి పై తీవ్ర విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!