సినిమా

Acharya-Susmitha: `ఆచార్య` ప్రీ రిలీజ్ వేదిక‌ను చిరూ కూతురు భ‌లే వాడుకుంటుందిగా!

Share

Acharya-Susmitha: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో చిత్ర టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ – యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. అయితే ఆచార్య ప్రీ రిలీజ్ వేద‌క‌ను చిరూ పెద్ద కుమార్తె సుస్మిత త‌న సినిమా కోసం వాడేసుకుంటుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సుష్మిత‌ర ప్ర‌స్తుతం త‌న గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై `శ్రీదేవి శోభన్ బాబు` అనే సినిమాను నిర్మిస్తోంది. ఇందులో సంతోష్ శోభన్ హీగా న‌టించ‌గా.. గౌరి జి.కిషన్ హీరోయిన్‌గా న‌టించింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించ‌గా.. కమ్రన్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.

ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన ‘శ్రీదేవి శోభన్‌ బాబు’ టీజర్‌కు మాంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ట్రైల‌ర్‌ను `ఆచార్య‌` ప్రీ రిలీజ్ పంక్ష‌న్‌లో లాంఛ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర టీమ్ కొద్ది సేప‌టి క్రిత‌మే అధికారికంగా అనౌన్స్ చేసింది. ఏదేమైనా ఆచార్య పంక్షన్‌లో శ్రీదేవి శోభన్‌ బాబు ట్రైల‌ర్‌ను వ‌దిలితే.. సంతోష్ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డ‌టం ఖాయం.


Share

Related posts

శ్రీదేవికి షాక్ ఇచ్చిన బోనీ కపూర్…

Siva Prasad

కోవిడ్ 19 టైం లో కూడా భయపడకుండా దిల్ రాజు డేరింగ్ నిర్ణయం…!!

sekhar

66వ జాతీయ అవార్డులు

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar