సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పదం ‘నెపోటిజమ్’. అప్ కమింగ్ నటీ నటుల నుండి స్టార్ నటుల వరకూ సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి స్థిరపడిన వారిని ఈ నెపోటిజమ్ పేరుతో తెగ హేళన చేస్తున్నారు. వాళ్ళ సినిమాలు చూడము అని చెప్పడమే కాకుండా యూట్యూబ్ లో వాళ్ళ వీడియోలకి డిస్ లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. మరి దానికి శ్రీదేవి కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా?
వీరే బాధితులు…
ఇలా విపరీతమైన ట్రోల్స్ బారినపడిన నటీనటుల్లో అలియా భట్, అనన్య పాండే, ఆదిత్య పంచోలి కొడుకు సూరజ్ పంచోలి, అర్జున్ కపూర్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారిలో జాన్వికపూర్ కూడా ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు జాన్వి కపూర్ రెండు సంవత్సరాల క్రితం మరాఠీ సూపర్ హిట్ చిత్రం సైరత్ రీమేక్ గా ‘దఢక్’ సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జాన్వి కపూర్ పై కూడా ఇప్పుడు ఈ నెపోటిజమ్ ట్రోల్స్, సూటిపోటి మాటలు మొదలైపోయాయి.
గుంజన్ సక్సేనా తో రెట్టింపు…
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత జాన్వికపూర్ నటనను అందరూ విమర్శించారు. “నీ నటన చూసేందుకు మీ అమ్మ లేకపోవడమే మంచిదయింది….” అని వ్యక్తిగత కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత ఘోస్ట్ స్టోరీస్ లో ఒక పాత్రలో నటించింది జాన్వీ. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అందులో కూడా జాన్వికపూర్ డల్ గా ఉందని విమర్శించారు. ఇక తాజాగా ఆమె నటించిన గుంజన్ సక్సేనా బయోపిక్ కూడా లాక్ డౌన్ కారణంగా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదలయింది. ఈ సినిమా కు కు జాన్వి కపూర్ నటన అసలు ఏమాత్రం మెప్పించలేకపోయింది అని చాలా మంది చెప్పారు. కొంతమంది అయితే పర్వాలేదనిపించింది అని చెప్పారు. మరి కొంత మంది…. ఆమెకు కనీసం ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన సెల్యూట్ చేయడం రాదు ఆమెకి ఎందుకు యాక్టింగ్ అని విమర్శలు మొదలుపెట్టారు.
అందుకే ఆ మాట అనేసింది!
దీంతో జాన్వీకపూర్ తీవ్ర మనస్థాపానికి గురి అయిపోయిందట. తనను ప్రోత్సహించేందుకు విమర్శలు చేస్తే సరే కానీ…. ఇలా నెపోటిజమ్ పేరుతో గుడ్డిగా తను ఏం చేసినా విమర్శించడం ఏమాత్రం బాగోలేదని ఆమె వాపోయిందట. ఇక నిజంగా వారు అన్నట్టే… “ఇవన్నీ చూసేందుకు మా తల్లి లేకపోవడం మంచిదయింది… లేదంటే నా కన్నా మా అమ్మ ఇటువంటి ప్రేక్షకులను చూసి ఇంకా ఎక్కువ బాధపడేది,” అని వాపోయిందట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!