30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Entertainment News సినిమా

Srikanth: విడాకుల వార్తలపై గట్టిగా కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్..!!

Share

Srikanth: హీరో శ్రీకాంత్ ఆయన భార్య ఊహ విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఇటీవల వార్తలు వైరల్ కావడం తెలిసిందే. 1997వ సంవత్సరంలో వీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది జనవరిలో 25 సంవత్సరాల పెళ్లి వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులతోపాటు ఒక కుమార్తె ఉంది. అయితే ఇటీవల కొన్ని ఆర్థిక ఇబ్బందులు కారణాలవల్ల శ్రీకాంత్ తన భార్య ఊహకి విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు షికార్లు చేశాయి.

Srikanth gave a strong counter to the divorce news
Srikanth

దీంతో వచ్చిన వార్తలపై శ్రీకాంత్ చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. కొన్ని చిల్లర వెబ్ సైట్లు… యూట్యూబ్ ఛానల్స్ ఇటువంటి వార్తలు రాస్తున్నాయి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు అర్థం కావడం లేదు. నా మీదే కాదు చాలామంది సెలబ్రెటీల మీద ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్ లాపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు. గతంలో ఇదే రీతిగా తాను చనిపోయినట్లు కొన్ని వార్తలు రాయడం జరిగిందని అప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా.. అందరం దైవదర్శనానికి వెళ్తున్నాం.

Srikanth gave a strong counter to the divorce news
Srikanth 

ఈ క్రమంలో ఈ వార్తలను భార్యవోహకి ఆమె ఫ్రెండ్స్.. ఫార్వర్డ్ చేస్తే ఆమె నాకు పంపించింది. వెంటనే ఇటువంటి వార్తలు చూసి కంగారు పడొద్దు అని ధైర్యం చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా కుటుంబంతో దైవదర్శనానికి వెళ్తుంటే ఎటువంటి వార్తలు పోస్టులు చూస్తుంటే చాలా చికాకు కలిగిస్తున్నాయని.. తనదైన శైలిలో శ్రీకాంత్ చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. కాగా ఒక్కపుడు హీరోగా బిజీగా ఉన్న శ్రీకాంత్ ఇప్పుడు…నెగిటివ్ పాత్రలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు.


Share

Related posts

ఆ వాట్సాప్ వాడితే మీరు చిక్కుల్లో పడినట్లే..వాట్సాప్ సీఈవో వార్నింగ్ !!

sekhar

ఇస్మార్ట్ బ్యూటీకి పవర్ స్టార్ సినిమాతో పాటు తమిళంలో వరసగా అవకాశాలు ..!

GRK

Rajamouli Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య బాబు మల్టీస్టారర్ మూవీ..??

sekhar