Ram Charan: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసే అప్ డేట్ ముందుగానే రావడం విశేషం. అవును… RRR తరువాత రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రంగానూ, రామ్ చరణ్ 15వ చిత్రంగానూ ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత వుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. జయరామ్, సునీల్, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక తాజా షెడ్యూల్ ఇటీవల రాజమండ్రిలో ప్రారంభమైంది.
Ram Charan : సినిమాల్లో ఆరితేరిన రామ్ చరణ్, బిజినెస్ లో మాత్రం నష్టాల్లో కూరుకుపోయాడు!
Ram Charan: ఇందులో మెయిన్ విలన్ శ్రీకాంత్ కాదు!
ఇకపోతే శంకర్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి కూడా ఓ సామాజిక సమస్యని కథాంశంగా తీసుకున్నట్టు భోగట్టా. ఇక ఇందులో చరణ్ ఎన్నికల కమీషనర్ గా నటిస్తుండగా.. తమిళ దర్శకుడు, నటుడు S.J.సూర్య CMగా నటిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే ఒక్కడు తరహాలో ఎన్నికల కమీషనర్ కి, సియం కి మధ్య ఇగో క్లాష్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాగా ఇది ఒకే ఒక్కడికి రీమేకా లేదంటే ఫ్రెష్ స్టోరీనా అనే విషయం ఇంకా తెలియాల్సి వుంది.
Ram charan : రామ్ చరణ్ కూడా ఛాన్స్ ఇచ్చేశాడు..ఇక ఆమె ఎన్నేళ్ళు ఇండస్ట్రీని ఏలుతుందో..?
రిలీజ్ ఈ సంవత్సరమే…
SS థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలుపుకొని రూ. 350 కోట్లపైగానే బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్, ఆచార్య’ మార్చ్, ఏప్రిల్ నెలల్లో వరుసగా విడుదల కానున్నాయి. అలాగే ఈ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాలో మూడు గెటప్స్ లో చెర్రీ కనిపిస్తాడని టాక్.