Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి.. చేసింది ఒక్క సినిమానే అయినా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిందీ బ్యూటీ. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామకు తొలి అవకాశామే `కేజీఎఫ్` వంటి భారీ చిత్రంలో అవకాశాన్ని అందుకుంది. ఇందులో రాఖీబాయ్కు రాణీగా నటించి చాక్లెట్ కళ్లతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిందీ శ్రీనిధి శెట్టి.
దీంతో అన్ని భాషల నుంచీ ఆమె ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే శ్రీనిధి శెట్టి మాత్రం చాలా జాగ్రత్తగా తన రాబోయే సినిమాలను ఎంపిక చేస్తోంది. ప్రస్తుతం ఈమె నటించిన `కోబ్రా` చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ లో తమిళ స్టార్ విక్రమ్ హీరోగా నటించగా.. ఆయన సరసన శ్రీనిధి నటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 11న తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇందులో విక్రమ్ 25 గెటప్స్‌లో కనిపించబోతుండటం విశేషం. ఇకపోతే తాజాగా శ్రీనిధి శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇంటర్వ్యూలో అడిగిన అన్ని ప్రశ్నలకు ఆమెకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
మీరు అభిమానించే నటీనటులు ఎవరు? అని ప్రశ్నించగా.. యశ్, విక్రమ్, బాలీవుడ్ నటి మధుబాల అని శ్రీనిధి చెప్పుకొచ్చింది. మీ హ్యాండ్‌బ్యాగ్‌లో కచ్చితంగా ఉండే వస్తువులు ఏంటనగా.. ఫోన్ చార్జర్, లిప్ బామ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని సమాధానమిచ్చింది. అలాగే భారతీయ వంటకాలంటే తనకెంతో ఇష్టమని, ఎంటర్టైన్మెంట్-స్పోర్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపింది. ఇక పేరు ప్రఖ్యాతలు కావాలా? డబ్బు కావాలా? అని ప్రశ్నిస్తే.. ఆ రెండిటిలో నాకు మాత్రం డబ్బే కావాలంటూ బోల్డ్ కామెంట్ చేసింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!