Sruthi Haasan : తమిళ స్టార్ లోకనాయకుడు కుమార్తె శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న శృతిహాసన్ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే క్రాక్ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శృతిహాసన్ మంచి విజయాన్ని అందుకుంది.
sruti haasan new boy friend santanu hazarika came chennai pics go viralఈ సినిమా మంచి విజయం సాధించడంతో శృతిహాసన్ కెరీర్ మరి గాడిలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుస అవకాశాలు రావడంతో శృతిహాసన్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే శృతిహాసన్ ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ గానే ఉంటారు. అందుకు కారణం ఆమె ప్రేమలో ఉండడమే.శృతిహాసన్ ఇది వరకే ఒకరితో ప్రేమలో ఉండి అతని నుంచి బ్రేకప్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ ఆర్టిస్ట్ సంతాను హజారికతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ముంబయ్ లో తిరుగుతూ ఎన్నోసార్లు మీడియా కంట పడ్డారు. అదేవిధంగా శృతిహాసన్ 35వ పుట్టినరోజు వేడుకలో శాంతాను హజారికతో ఆమెకి స్పెషల్ విషెస్ తెలియజేస్తూ ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అప్పట్లో ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ విషయం గురించి శృతిహాసన్ ఏమీ మాట్లాడటం లేదు.
Sruthi Haasan : తాజాగా శృతి హాసన్ కోసం అక్కడికి వెళ్ళిన బాయ్ ఫ్రెండ్
తాజాగా శృతి హాసన్ కోసం శాంతాను చెన్నై వచ్చారు. దీంతో వీళ్లిద్దరు కలిసి ఎంతో క్లోజ్ గా దిగిన ఫోటోను శృతిహాసన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అదేవిధంగా ఆ ఫోటోకు చెన్నై చిల్లింగ్స్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరి లవ్ లో ఉన్నట్లు ఫిక్స్ అయిపోయారు. కానీ ఓ ఇంటర్వ్యూలో శాంతను అభిప్రాయాలు కలవడంతో వృత్తిపరంగా మంచి స్నేహితులని… వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని తెలియజేసినప్పటికీ, బయటకు మాత్రమే అలా చెబుతున్నారని వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాంతాను చెన్నై వెళ్లి శృతితో దిగిన ఫోటోను చూసిన నెటిజన్లు మరోసారి వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు ఫిక్స్ అయ్యారు.