RRR: దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి భారతదేశ సినిమా రంగం యొక్క దిశా దశ మార్చేశాడు. బాహుబలి 2, RRR సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించాడు. దీంతో ఇండియాలో ఏ దర్శకుడు అందని ఘనత ప్రపంచ స్థాయిలో రాజమౌళికి అందుతూ ఉంది. దీనిలో భాగంగా ఎప్పటికీ పలు అంతర్జాతీయ సినిమా వేడుకలకు రాజమౌళికి ఆహ్వానాలు అందడం తెలిసిందే. ఇక ఇదే సమయంలో రాజమౌళి తెరకెక్కించిన RRR సైతం ఆస్కార్ అవార్డు రేసులో దూసుకుపోతుంది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు RRR ఆస్కార్ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా మద్దతు కూడా తెలుపుతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా హాలీవుడ్ టాకీ షోకి అతిథిగా రాజమౌళికి ఆహ్వానం అందింది. పూర్తి విషయంలోకి వెళ్తే గోల్డెన్ గ్లోబల్ అవార్డులకు RRR నామినేషన్ లో ఉన్న నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ టాకీ షో “లేట్ నైట్ విత్ సేత్ మేయర్స్” నుంచి ఆహ్వానం అందింది. ఈ షోలో రాజమౌళి తో పాటు హాలీవుడ్ నటి అలీసన్ విలియమ్స్ కూడా పాల్గొననుంది. దీంతో ఈ షోలో పాల్గొన్న తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి రికార్డు క్రియేట్ చేశాడు. ఏది ఏమైనా RRR మాత్రం రాజమౌళి రేంజ్ అమాంతం ఇంటర్నేషనల్ స్థాయికి పెంచింది. RRR కంటే బాహుబలి 2 విజయం సాధించిన గాని..RRRతోనే ప్రపంచ స్థాయిలో జక్కన్నకి గుర్తింపు లభించింది.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాజమౌళి ఇండియా వచ్చాక మహేష్ ప్రాజెక్టు పై దృష్టి పెట్టనున్నట్లు… మే నెలలో సినిమా అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మహేష్ సెంటిమెంట్ పరంగా ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు తన కొత్త సినిమాకి సంబంధించి ఏదో ఒక ప్రకటన చేస్తుంటాడు. ఈసారి రాజమౌళి ప్రాజెక్ట్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.