RRR: నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జాతీయ చలనచిత్రా 69వ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు.. అవార్డులు అందుకున్నారు. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరో అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకుని రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు తెలుగులో ఏ హీరోకి ఉత్తమ జాతీయ అవార్డు రాలేదు. ఫస్ట్ టైం పుష్ప సినిమాకి ఈ అవార్డు లభించింది. ఈసారి తెలుగు సినిమాలు భారీ ఎత్తున సత్తా చాటాయి. “పుష్ప సినిమాకి రెండు పుట్టిన సినిమాకి ఒకటి తర్వాత…పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ రాజమౌళి “RRR” కి ఆరు అవార్డులు సాధించి హవా చట్టడం జరిగింది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకుగాను నేపథ్య సంగీతానికి కీరవాణి, కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్‌కి శ్రీనివాస్ మోహన్, ప్లే బ్యాక్ సింగర్ కాలభైరవ, స్టంట్ కొరియోగ్రఫీకి కింగ్ సోలమన్ ‘కొండపొలం’ పాటకు చంద్రబోస్ అవార్డులు అందుకున్నారు. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచేసింది. ఈ సినిమాకి ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్ కూడా లభించింది. అనేక అంతర్జాతీయ అవార్డులు ఈ సినిమాకి వరించాయి.
ఈ సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ప్రపంచంలో టాప్ మోస్ట్ దర్శకులు జేమ్స్ కామెరూన్ లాంటివాళ్ళు RRR చూసిన తర్వాత రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచ స్థాయిలో ఓటీటీ రంగంలో… అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. సినిమా హీరోలు చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ప్రపంచ మార్కెట్ కూడా క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆరు జాతీయ అవార్డులు ఈ సినిమాకి రావటంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.