మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “SSMB 28” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాలి. “సర్కారు వారి పాట” రిలీజ్ అయిన తర్వాత జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మహేష్ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిపోవడం జరిగింది. దాదాపు రెండు నెలలకు పైగానే టూర్ వేసిన మహేష్ ఆగస్టు తొలి వారంలో ఇండియాకి చేరుకున్నారు.
అయితే ఇంతలోనే ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ అయ్యాయి. దీంతో సినిమాకి సంబంధించి మొదలు కావలసిన షూటింగ్ ఆగిపోయింది. ఈ పరిణామంతో అప్పట్లో మహేష్ పుట్టినరోజు సందర్భంగా “SSMB 28” ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టైటిల్ విడుదలవుతుందని ఎదురు చూసి అభిమానులకు నిరాసేది అయింది. కానీ ఈసారి దసరా పండుగకు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్ ప్రకటించడానికి త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు సమాచారం.
మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. సో దసరా పండుగకు “SSMB 28” కి సంబంధించి అప్ డేట్ రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంతో రెగ్యులర్ షూటింగ్ ఏకధాటిగా చేసి.. అనుకున్న సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సరికొత్త షెడ్యూల్ త్రివిక్రమ్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజ హేగ్దే హీరోయిన్.