Mega 154: దర్శకులు సినిమాలలో అప్పుడప్పుడు కనిపించడం గతకొంతకాలంగా చూస్తూనే ఉన్నాము. కొంతమంది దర్శకులు డైరెక్షన్ మానేసి పూర్తిగా నటనకే ప్రాధాన్యత ఇస్తూ అటువైపు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నువ్వులేక నేను లేను సినిమాతో దర్శకుడుగా మారిన కాశీ విశ్వనాథ్ ఆ తర్వాత సినిమాలలో కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. తమిళ దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్ కూడా సినిమాలలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. ఇది సరదాగా అనుకున్నా ఇప్పుడు అదే బిజీ వర్క్ అవుతోంది.
ఇక టాలీవుడ్లో దర్శకుడు రవిబాబు కూడా ముందు నటుడిగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అల్లరి సినిమాతో దర్శకుడయ్యాక కూడా వరుసగ సినిమాలను డైరెక్ట్ చేస్తూనే ఆ సినిమాలలో అలాగే, బయట సినిమాలలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి సర్ప్రైజ్ చేస్తున్నారు. గతంలో అక్కినేని నాగ చైతన్య, సమంత ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమా ఏ మాయ చేశావేలో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పూరి స్క్రీన్ మీద చాలామంది చూడాలనే అనుకున్నారు.
Mega 154: పూరి మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుంటాడా..?
కానీ, టెంపర్..ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో కొన్ని క్షణాలు మాత్రమే కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు మెగా మూవీలో ఒక్క సీన్ కోసం పూరి మేకప్ వేసుకోనున్నాడట. చిరుతో సినిమా చేయాలనేది పూరి జగన్నాథ్‌కు ఉన్న పెద్ద డ్రీమ్. అదెప్పుడు నెరవేరుతుందో తెలీదు గాని, చిరు సినిమాలో చిన్న రోల్ మాత్రం చేసే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే…ఆ సమయంలో చిరు గనక కథ వింటే పూరి ఒప్పించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి మెగా 154లో కనిపించబోతున్న పూరి మెగా స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుంటాడా లేదా.