RRR: భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి లాంటి చారిత్రాత్మకమైన విజయం సాధించిన మూవీని చిత్రీకరించిన రాజమౌళి.. ఒక్కసారిగా దేశ విదేశాలలో పాపులర్ అయిపోయాడు. ఏకంగా భారతదేశ ప్రధాని కూడా దర్శకుడు ప్రతిభా శైలిపై ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా రాజమౌళి తో పని చేయడానికి రెడీగా ఉన్నట్లు.. ఇప్పటికిప్పుడు ఆయన ప్రాజెక్టు ఒప్పుకుంటే పనిచేయటానికి చాలామంది క్యూ లైన్ లో ఉండే పరిస్థితి. అటువంటి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
కాగా రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఏ సినిమాకి చేయని రీతిలో ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కి రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో “RRR” కి సంబంధించి ఎన్నో విశేషాలను తెలియజేశారు. పరిస్థితి ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగా సార్ మీ దగ్గర ఒక నెల రోజుల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా… పని చేస్తాను కేవలం నేను వచ్చి వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.. మీ నెక్స్ట్ సినిమాకి సంబంధించి షెడ్యూల్ లో ఒక్క నెలరోజులువచ్చి అలా వెళిపోతా … సార్ నాకు చిన్న అవకాశం ఇవ్వండి అంటూ రాజమౌళి ని ఇంటర్వ్యూలో కోరారు.
దానికి జక్కన్న ఓకే చెప్పడం జరిగింది. ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగా పనితనం కూడా రాజమౌళి మెచ్చుకోవటం జరిగింది. హాలీవుడ్ లో కబీర్ సింగ్ గా … అర్జున్ రెడ్డి ని రీమేక్ చేయడం పట్ల మూవీ పనితనం గురించి తనదైన శైలిలో రాజమౌళి ప్రశంసించారు. ఒక సందీప్ రెడ్డి కి మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి కి అదేవిధంగా యాంకర్ సుమ కి.. హీరో దగ్గుబాటి రానా కి రాజమౌళి “RRR” కి సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం.