‘రెమ్యూనరేషన్’పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో!

Share

ఫ్యామిలీ కథానాయకుడుగా జగపతి బాబు ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అగ్ర హీరోల పేరున తన పేరును లిఖించుకున్నారు. ఎన్నో సినిమాలతో హీరోగా తన ప్రతిభను చాటుకున్నారు. మరీ ముఖ్యంగా విభిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆడియన్స్ కు మరింత చేరువయ్యారు. హీరోగానే కాక..విలన్ గా కూడా తన ప్రతిభకు చాటుకున్నారు జగపతి బాబు. తెలుగు సినీ పరిశ్రమలోనే కాక..తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు. విలన్ గా ఆయన తీసిన సినిమాల్లో హీరోకు దీటుగా తన పాత్ర కూడా నిలుస్తుంటుంది.

లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా పరిచయయ్యి తన మరో టాలెంట్ ను బయటపెట్టారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా తనదైన ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు. దీనితో జగపతి బాబుకు మరో శోభన్ బాబు అనే పేరు కూడా ఉంది. ఇటీవలె జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ప్రస్తావించారు. తనకంటూ ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ లేదని తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

మరీ ముఖ్యంగా డబ్బు గురించి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పాస్ట్ లో కంటే ఇప్పుడే సినిమాల్లో కొత్త కొత్త పాత్రలను చేస్తూ సంతోషంగా గడుపుతున్నాని వెళ్లడించారు. విలన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి జగపతి బాబు చాలా బిజీబిజీగా మారారు. దీంతో జగపతి బాబు రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కాని తనకు అలాంటి భారీ స్థాయిలో ఉండే ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ లేదని చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా అసలు డబ్బు గురించి ఆలోచనే లేదని తెలిపారు. కొత్త కొత్త సినిమాలతో కొత్త వ్యక్తులను కలుసుకుంటూ సంతోషంగా ఉన్నాని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సినిమాలో నా క్యారెక్టర్ నచ్చితే ఫ్రీగా కూడా చేస్తానని వెళ్లడించారు. అలాగే సినిమా చేసేటప్పుడు ఎంత ఇస్తారనే విషయాన్ని తెలుసుకుంటాను గాని వాళ్లనెప్పుడూ డిమాండ్ చేయలేదని వెళ్లడించారు. జగపతి బాబు గారి మాటలను బట్టి చూస్తే కొత్త క్యారెక్టర్ లపై తనకున్న ఆసక్తిని కనబరుస్తుంది. వీరు మరిన్ని సినిమాలతో మనల్నందరినీ వినోదపరచాలని కోరుకుందాం.


Share

Related posts

బిగ్ బాస్ 4 : 25 లక్షలు తీసుకోవడం వెనుక లాజిక్ చెప్పిన సోహేల్

arun kanna

“అంధాధున్” తమిళ రీమేక్ లో సిమ్రాన్

Teja

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధీ అగర్వాల్ ని ఇంతమంది ఫాలో అవుతున్నారా ..?

GRK