Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ అందరికి సుపరిచితురాలే. దక్షిణాది చలనచిత్ర రంగంలో అనేక భాషలలో చాలామంది స్టార్ హీరోలతో నటించింది. అలనాటి అందాల నటి సావిత్రి బయోపిక్ “మహానటి” సినిమాలో టైటిల్ రోల్ పోషించి తన నటనతో అందరిని ఆకట్టుకుని.. జాతీయ అవార్డు అందుకోవటం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో పెద్ద హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి లతో సినిమాలు చేయడం జరిగింది. చిరంజీవితో “భోళా శంకర్” సినిమాలో చెల్లెల పాత్రలో.. నటించడం జరిగింది. ఈ సినిమా ఆగస్టు 11 వ తారీకు విడుదల కాబోతోంది.
నటనపరంగా ఇంకా డాన్స్ పరంగా అన్ని రకాలుగా ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ తో కీర్తి సురేష్ చాలా మంది అభిమానులను సంపాదించింది. ఇటీవల నాచురల్ స్టార్ నానితో నటించిన “దసరా” సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేసే.. కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిది స్టాలిన్ హీరోగా నటించిన కొత్త సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా జూన్ 29వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కి అనూహ్యమైన ప్రశ్న ఎదురయ్యింది. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించడం జరిగింది. దీంతో కీర్తి సురేష్ ఈ విషయంపై తాను ఇంకా ఆలోచిస్తున్నట్లు.. స్పష్టం చేశారు. ఈ జవాబుతో భవిష్యత్తులో కీర్తి రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు కీర్తి తల్లి మేనక తమ కూతురు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.