సందడి మాములుగా లేదు

Share

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలియికలో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న రాజమౌళి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి, సంక్రాంతి అయ్యాక సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ గ్యాప్ లో ఒకపక్క తన టీంతో rrr సినిమా పనులు చేసుకుంటూనే మరోపక్క కొడుకు కార్తికేయ పెళ్లి పనులు కూడా చూసుకుంటున్నాడు. కార్తికేయ, పూజా ప్రసాద్‌ల వివాహ వేడుక జైపూర్‌లో జరగనుంది. అక్కడి కుకాస్‌లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్‌లో డిసెంబరు 30న ఈ వేడుక జరగబోతోంది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ నుంచి టాప్ స్టార్స్ డెస్టినేషన్ కి రీచ్ అయి పోయి సందడి చేయడం మొదలు పెట్టారు. చరణ్, ఎన్టీఆర్, రానా, నానిలు ఒకే సరి కలిసి వెళ్లిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. డెస్టినేషన్ రీచ్ అవ్వగానే చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, రానా డాన్స్ లు వేసి ఫుల్ ఎంజాయ్ చేశారు.

చరణ్, తారక్ ల సందడి అయిపోయాక సోలోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, సింపుల్ బట్ స్టైలిష్ లుక్ లో అలరించాడు. వచ్చి రాగానే అనుష్క, రాజమౌళితో చిందేసిన ప్రభాస్, ఫంక్షన్ కి కొత్త కల తీసుకొచ్చాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ రెండు వీడియోలతో పాటు ప్రభాస్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా బయటకి వచ్చింది. తారక్ ది ఎలిఫాంట్ మెమరీ అంటూ కీరవాణి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో అక్కడ అంతా సందడి వాతావరణం ఏర్పడింది. టాప్ హీరోస్ తో అక్కినేని ఫ్యామిలీ, అడవి శేష్ లతో పాటు మరికొంతమంది సెలెబ్రిటీలు ఈ పెళ్లిలో సందడి చేస్తున్నారు. పెళ్లి ఫొటోలతో పాటు బంగారం says ss అనే హాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఆ హ్యాష్ టాగ్ అర్థం ఏంటంటే పూజను కార్తికేయ ప్రేమగా ‘బంగారం’ అని పిలుస్తాడట. పూజ మాత్రం కార్తికేయను ‘ఎస్ ఎస్’ అని పిలుస్తుందట.. సో అది ‘బంగారం సేస్ ఎస్ఎస్’ సంగతి. ఈ ట్యాగ్ ని ఫాలో అయిపోతే జైపూర్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ చూసేయొచ్చు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కాబట్టి సోషల్ మీడియాలో కార్తికేయ పెళ్లి నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి. అక్కడ తరాల సందడి ఎలా చేయబోతున్నారో చూడాలి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : చీకట్లో అఖిల్ – సోహెల్ చేస్తున్న పని చూసి షాక్ అయిన మోనాల్..! అర్థరాత్రి వేళ కౌగిలింతలు….

arun kanna

Shobhita Rana Amazing Looks

Gallery Desk

బిగ్ బాస్ 4 : నాగార్జున ఇలా బుక్ అయ్యాడేంటి..? అతను చూపించిన ఆ తేడాకి తిట్టిపోస్తున్నారుగా

arun kanna

Leave a Comment