Samantha: సమంతను ఐటం సాంగ్ చేస్తే ఇంత క్రేజ్ వస్తుందా..అని పుష్ప సినిమా మేకర్స్ అస్సలు ఊహించి ఉండరు. సమంత కెరీర్లో ఇంత నాటుగా అందాలను ఆరబోసి ఐటెం సాంగ్ చేసింది. ఆ మాటకు వస్తే అసలు తన కెరీర్లో ఎప్పుడు ఐటెం సాంగ్ చేయాలనే ఆలోచనలో లేదు. సమంతకు స్టార్ హీరోయిన్గా ఉన్న క్రేజ్ చూసి కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా తీసుకున్నారే తప్ప ఐటెం సాంగ్ చేయించాలనే ఆలోచన మాత్రం మన దర్శకులకు రాలేదు.
తెలుగులో సమంత పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, నాని, మహేశ్ బాబు, నాగార్జున, నాగ చైతన్య, అల్లు అర్జున్ లాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తమిళంలో కూడా సూర్య, ధనుష్, విజయ్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. కమర్షియల్ సినిమాలకు సమంత పర్ఫెక్ట్ హీరోయిన్. ఎంతవరకు గ్లామర్‌గా కనిపించాలో అంత గ్లామర్‌గా కనిపించి కవ్వించింది. హీరోలకు పెదవి ముద్దులు బాగానే ఇచ్చింది. అందుకే, సమంత సౌత్‌లో బాగా పాపులర్ అయింది. ఇక ఆమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం హిట్స్ దక్కడం కూడా బాగా కలిసొచ్చింది.
Samantha: 200 మిలియన్స్ వ్యూస్ దాటి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమంత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద ది ఫ్యామిలీ మెన్ సీజన్లో రాజీగా డీ గ్లామర్ రోల్లో నటించి ఆకట్టుకుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్‌లో ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా సాంగ్ చేసింది. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను అనుకున్న తర్వాత ఫైనల్‌గా సమంతను తీసుకున్నారు. సమంత ఈ పాటలో అందాల ఆరబోతతో మోత మోగించింది. డీఎస్పీ మ్యూజిక్కు సమంత అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. దాంతో మాస్ ఆడియన్స్‌ను ఈ సాంగ్ బాగా ఎక్కింది. ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్స్ వ్యూస్ దాటి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.