Editorial : indians,ది కాశ్మీర్ ఫైల్స్’ అనేది కచ్చితంగా వివాదాస్పదమైన అంశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని వివేక్ అగ్నిహోత్రి అంతే వివాదాస్పదం గా తీయడం లో విజయవంతం అయ్యాడు. ఒక జాతీయ పార్టీ, ఆ పార్టీ లోని ఒక బ్యాచ్.. ఒక మతానికి కి వ్యతిరేకంగా బాగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మరొక religion జనాలు ఎగబడి చూస్తూ, ఆ సినిమా చూడడమే దేశభక్తి (patriotism) అనే ఆలోచనలో ఉన్నారు.
Editorial : ఓకే శభాష్ ,మంచిది.. సంతోషం …
అన్ని లక్షల మంది కాశ్మీర్ పండిట్స్ ని నరమేధం చేసినప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. కేవలం ఒకవైపు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నామా లేదా రెండు పక్కలా అన్నీ క్రోడీకరించుకుని మాట్లాడుతున్నామా అనేది తరవాత తేలుతుంది, ఫస్ట్ మాట్లాడటం అయితే స్టార్ట్ చేయాలి. డిబేట్స్ మరియు డిస్కషన్స్ వాటికి సొల్యూషన్ తీసుకువస్తాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన మాట.
నా పాయింట్ ఏమిటంటే.. ఎవరైతీ THE KASHMIR FILES ని సపోర్ట్ చేస్తున్నారో .. వారంతా .. రేపొద్దున్న ఎవ్వడో ఉద్దేశ్య పూర్వకంగా కాశ్మీర్ విమెన్ మరియు యువత మీద ఇండియన్ ఆర్మీ అట్రాసిటీస్ గురించి సినిమా లేదా డాక్యుమెంటరీ తీసినా ఇలాగే యాక్సప్ట్ చేయాలి మరి. కాశ్మీర్ పండిట్స్ మీద జరిగిన దారుణాలను నిజానిజాలు తెలియకుండా కంప్లీట్ గా డైరెక్టర్ చెప్పిందే నిజమని మనం నమ్మినప్పుడు రేపు ఎవ్వడో వాడి పర్సెప్షన్ లో
ఆ విషయం మీద సినిమా లేదా డాక్యుమెంటరీ తీసినప్పుడు యాక్సప్ట్ చేయగలగాలి. 1948 హైదరాబాద్ ముస్లిం ల మారణకాండ మీదనో, 1969 గుజరాత్ riots మీదనో ఎవ్వడో సినిమా /డాక్యుమెంటరీ తీస్తే దాన్ని తప్పు / ఫేక్ / అబద్దం, బ్యాన్ చేయండి అని అనకూడదు మరి. దాన్ని ఇలాగే ఎగబడి చూడాలి, సపోర్ట్ చేయాలి.
అవతలి వారు బాధితులు అయినప్పుడు కించిత్ కూడా సపోర్ట్ చేయకుండా, సొంత వర్గం మీద జరిగిన అన్యాయాలు మాత్రమే నిజం గా జరిగాయి అని గుడ్డిగా నమ్ముతున్నావు అంటే నువ్వే అసలు సిసలు దేశ ద్రోహివి. బాధ అనుభవించేవాడు/అనుభవించిన వాడు ఎవ్వడైనా మనిషే.. అందరి కథలు వ్యధాలూ బాధలూ ప్రపంచానికి తెలియాలి అనుకున్నప్పుడే నువ్వు మనిషివి. బాధ విషయం లో కూడా సొంత religion/region/community ఇలాంటివి పట్టుకుని వాల్లవి మాత్రమే నిజమని నమ్మి , అవే సపోర్ట్ చేస్తాము… ఎదుటివాడి కష్టాలు /జరిగిన అన్యాయం నిజం కాదు.. అని ఫీల్ అవుతున్నావ్ అంటే నీ వల్ల ఒక టెర్రరిస్ట్ వల్ల ఉన్నంత హాని ఉంటుంది భవిష్యత్తు తరాలకి అని గుర్తు పెట్టుకో. ఇది అన్ని మతాలు/ప్రాంతాలు/వర్గాల వారికి వర్తించే అంశం.