వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు మోహన్‌బాబు. ప్రస్తుతం ఈయన సినిమాల ఎంపికలో అచితూచి వ్యవహరిస్తున్నారు. తమిళ చిత్రాల్లో మోహన్‌బాబుకు వరుస అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా దర్శకుడు మణిరత్నం.. తను చేయబోయే హిస్టారికల్ చిత్రం `పొన్నియల్ సెల్వన్` నవల ఆధారంగా రూపొందనున్న చిత్రంలో కీలక పాత్ర కోసం మోహన్‌బాబును సంప్రదించాడు. కాగా ఇప్పుడు సూర్య సినిమాలో మోహన్‌బాబు నటించబోతున్నాడు. నిజానికి మోహన్‌బాబు ఈ చిత్రాన్ని ఎప్పుడో ఓకే చేసేశాడు. ఈ సినిమా తర్వలోనే సెట్స్‌కు వెళ్లనుంది. సూర్య, కె.వి.ఆనంద్ సినిమా `కాప్పాన్` పూర్తి కాగానే సధాకొంగర దర్శకత్వంలో సూర్య సినిమా మొదలవుతుంది. డెక్కన్ క్రానికల్ చీఫ్ గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కబోయే ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రధారిగా నటిస్తున్నారు.
previous post
next post