సుడిగాలి సుధీర్ కి కరోనా…? ప్రస్తుతం ఎలా ఉందంటే….

టెలివిజన్ సెలెబ్రిటీ, ఫిల్మ్ యాక్టర్, జబర్దస్త్ టాప్ లీడర్స్ లో ఒకడైన సుడిగాలి సుదీర్ ప్రస్తుతం చాలా బిజీ అయిపోయాడు. షో ల పై షో లు చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్ గా మారిపోయాడు. అయితే ఈ కమెడియన్ ఇప్పుడు కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా సుడిగాలి సుధీర్ వీటిపై స్పందించకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇటీవలే అతడు స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. ఇక అతనికి కోవిడ్ పాజిటివ్ అని సన్నిహితులు ధృవీకరిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత సుధీర్ వరుస సినిమాలతో, షో లతో బిజీ అయిపోయాడు. ఆదివారం ఈ కరోనా విషయం బయట పడింది. ప్రస్తుతానికైతే అతను స్వీయ గృహనిర్బంధం ఉన్నాడు అని అంటున్నారు. ఇక అంతే కాకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని కారణాలను ఎవరూ వెల్లడించ లేకపోయారు. సుధీర్ తో కాంటాక్ట్ కావడానికి మీడియా వర్గాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇక అధికారికంగా ఈ వార్తలపై సుధీర్ స్వయంగా స్పందించే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

ఇటీవల ‘అక్క ఎవరే అతగాడు’ అనే స్పెషల్ షో కోసం సుధీర్ షూటింగ్ లో పాల్గొన్నాడు, అతని తో పాటు గా ఆటో రామ్ ప్రసాద్, రష్మి గౌతమ్ కూడా పాల్గొన్నారు. ఈ షో అక్టోబర్ 25వ తేదీన దసరా సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో కి మంచి స్పందన వస్తోంది. ఈ సమయంలో ఇలాంటి వార్తలు రావడం నిజంగా అవాంఛనీయం.