Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా గుర్తింపు పొందిన సుధీర్.. యాంకర్‌గా, సింగర్‌గా, డ్యాన్సర్‌గానూ అలరించి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. `సాఫ్ట్వేర్ సుధీర్` అనే సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఇకపోతే స్మాల్ స్క్రీన్‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సుధీర్.. ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతాడా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. కానీ, ఆ శుభ తరుణం మాత్రం రావడం లేదు. దీంతో వెండితెరపై ప్రభాస్ పెళ్లి ఎంత హాట్ టాపిక్కో.. బుల్లితెరపై సుధీర్ పెళ్లి కూడా అంతే హాట్ టాపిక్‌గా మారింది.
అయితే తాజాగా తాను హోస్ట్ చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ఎపిసోడ్లో పెళ్లిపై సుధీర్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ షోలో ‘మా నాన్నకి పెళ్లి’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఓ స్కిట్ చేయగా.. అందులో బుల్లెట్ భాస్కర్ ఫాదర్ తో పాటు మరికొందరు కమెడియన్స్ తండ్రులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ఫాదర్ సుధీర్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు.
టీవీ షోలలో మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటున్నావ్.. రియల్‌గా పెళ్లి ఎప్పుడు..? ఇండస్ట్రీలో అమ్మాయిని చేసుకుంటావా? లేక బయట వాళ్లని చేసుకుంటావా..? అని ప్రశ్నించగా.. మిగిలిన వారందరూ కూడా కాబోయే భార్య ఎవరో చెప్పాలంటూ పట్టుబట్టారు. దీంతో సుధీర్ మొదట అమ్మాయిని పరిచయం చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి.. చివర్లో తనకు పెళ్లి కంటే ఫ్యాన్స్ ముఖ్యం, కాబట్టి పెళ్లి చేసుకోను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడీ స్టేట్మెంట్ సుధీర్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!