Sudigali Sudheer: సుడిగాలికి చేయినివ్వనన్న సీనియర్ హీరోయిన్.. డిప్రెషన్ లోకి సుధీర్!

Share

Sudigali Sudheer Jabardasth: సుడిగాలి సుధీర్ పరిచయం కొత్తగా అక్కర్లేదేమో. జబర్దస్త్ వేదికపై తనదైన శైలిలో మంచి కమెడియన్‌గా పాపులారిటీ సంపాదించాడు సుధీర్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక అమ్మాయిల విషయంలో సుధీర్ పై పేలే జోకులు గురించి వేరే చెప్పేదేముంది? కాలక్రమంలో పులిహోర రాజాగా మంచి ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సుధీర్ బుల్లితెరపై కెమెడియన్‌గా అలరిస్తూనే ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ ప్రోగ్రామ్ కి హోస్ట్‌గా పని చేస్తున్నాడు. ఈవేదిక మీదే ఓ సీనియర్ హీరోయిన్ మన సుధీర్ పైన ఓ కౌంటర్ వేసింది.

ఆ సీనియర్ హీరోయిన్ ఎవరు? వేసిన జోకేమిటి?

ఇక విషయంలోకి వెళితే, ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదండి.. మహేశ్వరి. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా స్వర్గంలో అంటూ న్యూ కాన్సెప్ట్‌తో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి మహేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో రిలీజ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్, మహేశ్వరి నడుమ జరిగిన సంభాషణ ఆ ప్రోమోకి హైలైట్ అయ్యాయనే చెప్పుకోవాలి. మరెందుకాలస్యం ఆ సంభాషణ ఏమిటో ఒకసారి చూద్దాం.

మహేశ్వరి – సుధీర్ మద్యం జరిగిన సంభాషణ ఇదే..

మహేశ్వరి వేదికపైకి రాగానే ‘మేడం హాయ్’ అంటూ సుడిగాలి సుధీర్ చేయి ఇవ్వబోయాడు. దానికి ఆమె చేయి ఇవ్వకుండా నమస్కారం పెడుతుంది. దాంతో అవాక్కయిన సుధీర్.. “ఏంటి? నమస్కారం పెడుతున్నారు?” అని అడుగుతాడు. దానికి మహేశ్వరి “వద్దు బాబు నేను చేతులు కలిపితే నువ్వు ఏ పులిహోరో కలుపుతావు!” అని అనేసరికి ఇంద్రజ సహా అక్కడున్న వారంతా తెగ నవ్వుతారు. తర్వాత మేడం.. ఇంతకీ నన్ను ఎక్కడుండమంటారు? అని సుధీర్ అడగడంతో “ఎక్కడైనా వుండు. కానీ, నా నుంచి మాత్రం దూరంగా వుండు.!” అని మహేశ్వరి కౌంటర్ వేస్తుంది. దీంతో సుధీర్ ఫ్యూజులు ఎగిరిపోతాయి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

37 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

40 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago