Sudigali Sudheer: జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు. హీరోగా కూడా అవకాశాలు అందుకుంటూ పలు సినిమాలు చేయడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు కష్టాలు ఎదుర్కోవటం జరిగింది. జబర్దస్త్ షోలో క్లిక్ అయ్యాక బుల్లి తెరపై మరికొన్ని అవకాశాలు అందుకుని… తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. జబర్దస్త్ షోలో ఉన్న అందరికంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సుడిగాలి సుదీర్ సొంతం. ఈటీవీలో అనేక కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ కడుపుబ్బ నవ్విస్తూ.. ఎంతోమంది అభిమానం సంపాదించాడు.
ముఖ్యంగా యాంకర్ రేష్మితో ప్రేమాయణం అంటూ… సుధీర్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచి అనేక వార్తలకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారాడు. ఇలా ఉంటే శనివారంలో పలు సినిమాలు చేసిన గాని పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో చేసిన దర్శకుడితో సుధీర్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే… అప్పట్లో ప్రభాస్ తో “మిస్టర్ పర్ఫెక్ట్” అనే సినిమా చేసిన దశరథ్… ఇప్పుడు సుడిగాలి సుదీర్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో.. ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల స్టొరీ విన్నట్లు చాలా బాగున్నట్లు… త్వరలోనే అధికారిక ప్రకటన చేయనన్నట్లు సమాచారం. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ప్రభాస్ కెరియర్లో చాలా క్లాసికల్ హిట్ అయింది. ప్రభాస్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. కుటుంబ విలువలను తెలిపే… సినిమా.. “మిస్టర్ పర్ఫెక్ట్”. ఈ సినిమాలో ప్రభాస్ హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా హైలైట్. 2011లో రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. కాకా ఇప్పుడు “మిస్టర్ పర్ఫెక్ట్” తీసిన దర్శకుడు దశరథ్ తో సుడిగాలి సుదీర్ సినిమా చేయనున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!