Pushpa 2: ఐకాన్ స్టార్ బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం తెలిసిందే. ఫస్ట్ టైం బన్నీ మూవీ పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయి… రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. ఏకంగా బాలీవుడ్ లో ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గాని.. అక్కడి స్టార్ హీరోలకు దీటుగా “పుష్ప” మొదటి భాగం విజయం సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
దీంతో ఇప్పుడు పుష్ప సీక్వెల్ “పుష్ప” సెకండ్ పార్ట్ రైస్.. విషయంలో డైరెక్టర్ సుకుమార్ మరియు బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సెకండ్ పార్ట్ కి భార్య తన ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని.. సినిమా షూటింగ్ త్వరగా ఏప్రిల్ లో స్టార్ట్ చేయాలని లో..మొన్న బన్నీ ఇంట్లో “పుష్ప” టీం సమావేశమైన సమయంలో నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
అయితే ఇప్పుడు బన్నీ, సుకుమార్ షూటింగ్ విషయంలో ప్లాన్ మార్చేసినట్లు సమాచారం. కారణం చూస్తే ఏప్రిల్ లో కాకుండా… మే లేదా జూన్ నెల చివరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. జూన్ నెలలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న తరుణంలో..పరిశోధకులు చెబుతున్న నేపథ్యంలో సుకుమార్ అదేవిధంగా బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా సెకండ్ పార్ట్ లో పాటలు మరియు డాన్స్ అదే రీతిలో ఫైట్లు చాలా కొత్తగా ఉండాలని సినిమా మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఫస్ట్ పాట రిలీజ్ అయిన దానికంటే సెకండ్ పార్ట్ దాదాపు ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అవ్వని విధంగా చాలా భాషలలో విడుదల అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.