Rajamouli – Sukumar: ఆర్ఆర్ఆర్..ఈరోజు ఎక్కడ చూసినా..విన్నా ఈ సినిమా గురించే. గత రెండేళ్ళ నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు కామన్ ఆడియన్స్ ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఉత్సాహంగా, ఆతృతగా ఎదురుచూశారు. 5 సార్లు ఈ భారీ పాన్ ఇండియా సినిమా వాయిదా పడింది. సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండుసార్లు వాయిదా పడితేనే అందరిలోనూ ఆ సినిమా మీద అంచనాలు తారుమారవడం జరుగుతుంది. ఆసక్తి కూడా సన్నగిల్లిపోతుంది.
కానీ, దర్శక ధీరుడు రాజమౌళి మాయాజాలమా లేక ఇద్దరు స్టార్ హీరోలకున్న క్రేజ్ ప్రభావమా తెలీదు గానీ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా అంచనాలు పెరిగాయే తప్ప కాస్తైనా తగ్గలేదు. ఇక రెండుసార్లు అత్యంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా కూడా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. పలువురు బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ స్టార్స్ నటించిన ఈ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ప్రీమియర్ షోస్ పడినప్పటి నుంచి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది.
Rajamouli – Sukumar: మీకూ మాకూ ఒకటే తేడా ..మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.
ఇప్పటికే మెగా, నందమూరి ఫ్యామిలీస్ చూసి సినిమాపై చిత్ర దర్శకుడు, హీరోలు చరణ్ – తారక్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై తన స్పందనను ట్విట్టర్ వేదికగా తెలిపారు. పలువురు దర్శకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ దర్శకుల జాబితాలో చేరిన సుకుమార్ కూడా రాజమౌళిపై ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇందులో సుక్కూ..”మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పెరిగెత్తాలి..మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి..రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలం అంతే”..అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది.