Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు సుకుమార్. డిఫరెంట్ స్టోరీ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తు ప్రతి సినిమాలో లాజిక్ ఉండేలా.. తనదైన శైలిలో.. హీరో క్యారెక్టరైజేషన్ రాయడం సుకుమార్ స్టైల్. నిజ జీవితంలో ప్రొఫెసర్ కావడంతో సుకుమార్ సినిమాలు చాలావరకు లాజికల్ గా ఉంటాయి. సైకోగా హీరో క్యారెక్టర్ ఉన్నాగాని… చూసే ప్రేక్షకుడికి నచ్చేలా దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే సుకుమార్ .. వరుసపెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ బ్యాక్ టూ బ్యాక్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “రంగస్థలం”.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ బన్నీతో ఇండియా మూవీ “పుష్ప”.. ఈ రెండు సినిమాలతో సుకుమార్ తన దమ్మేంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నారు. ముఖ్యంగా “పుష్ప” ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కలెక్షన్ లు.. చాలా మందికి మైండ్ పోయేటట్లు చేశాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో “పుష్ప” సినిమాకి సంబంధించి ఒక్క ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయిన గాని.. అక్కడ వంద కోట్ల కంటే ఎక్కువ రావటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
దీంతో ఇప్పుడు సుకుమార్ “పుష్ప” సెకండ్ పార్ట్ కి సంబంధించి తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ నడుస్తోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ కి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే సెకండ్ పార్ట్ వచ్చేసరికి … మొదటి భాగానికి ఇచ్చిన రెమ్యూనరేషన్ డబల్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే “పుష్ప” సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్.. జూన్ నెలాఖరు లేదా జులై మొదటి వారంలో ప్రారంభించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.