SIIMA 2022: సైమా అవార్డుల వేడుక బెంగళూరులో గ్రీన్ సిటీ వేడుకగా జరిగింది. సెప్టెంబర్ 10 మరియు 11వ తారీకులలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకలకు మొదటి రోజు పుష్ప సినిమాకి వరుస పెట్టే అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులు రాగా తర్వాత “పుష్ప” సినిమాకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ కి అవార్డు లభించింది. తెలుగు సినిమా రంగంలో స్టోరీలో హీరో క్యారెక్టర్ నెగిటివ్ గా చూపిస్తూనే.. హీరోయిజం ఎలివేషన్ అద్భుతంగా తెరపై పండించడంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ సుకుమార్.
ఈ తరహా లోనే ఎర్రచందనం స్మగ్లర్ గా.. అల్లు అర్జున్ ని “పుష్ప” సినిమాలో చూపించి అద్భుతమైన క్యారెక్టరైజేషన్ పాటు.. మేనరిజం జతచేసి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. “పుష్ప” పాటలు పరంగా ఇంకా సినిమా పరంగా అన్ని రకాలుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది.
తన కెరియర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా అయినా గాని అద్భుతంగా “పుష్ప” అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారు. దీంతో సైమా 2022 అవార్డులలో బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే “పుష్ప 2” కి సంబంధించి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడానికి సుకుమార్ మరోపక్క రెడీ అవుతున్నారు. ఇప్పటికే “పుష్ప 2” కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రెండో భాగం మొదటి భాగం కంటే అత్యధిక భాషలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.