21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: బాహుబలి కట్టప్ప తరహాలో “పుష్ప 3″కి సుకుమార్ ప్లానింగ్..??

Share

Pushpa 2: ఐకాన్ స్టార్ బన్నీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప” గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించటం తెలిసిందే. ఫస్ట్ టైం బన్నీ పాన్ ఇండియా నేపథ్యంలో చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇంత పెద్ద హిట్ అవుతుందని సినిమా యూనిట్ అస్సలు ఊహించలేదు. ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” సక్సెస్ మీట్ లో తెలియజేశారు. ఇప్పటికీ కూడా “పుష్ప” సినిమా డైలాగులు మరియు పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంక మేనరిజమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాల్లో, క్రీడలలో… టీవీ షో లలో ఎవరికి వారు తగ్గేదేలే అని అంటున్నారు.

Sukumar is planning for Pushpa 3 with base Baahubali Kattappa concept
Pushpa 2

దీంతో ఇప్పుడు “పుష్ప 2” పై అంచనాలు పెరిగిపోయాయి. పరిస్థితి ఇలా ఉంటే రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే.. మూడో పార్ట్ కి సుకుమార్ సంచలన ప్లాన్ వేయడం జరిగిందంట. మేటర్ లోకి వెళ్తే “పుష్ప 2” సెకండాఫ్ లో వచ్చే ఓ కొత్త క్యారెక్టర్ … సినిమా మొత్తాన్నికి ట్విస్ట్ ఇచ్చే రీతిలో క్రియేట్ చేయడం జరిగిందంట. ఆ క్యారెక్టర్ తోనే మూడో భాగం సినిమా కూడా ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త క్యారెక్టర్ ద్వారా “పుష్ప 2” క్లైమాక్స్ లో ట్విస్ట్ రివిల్ బహుబలినీ కట్టప్ప ఎందుకు చంపాడు అన్న రీతిలో సస్పెన్స్ లో పెట్టినట్లు.. సుకుమార్ సరికొత్త సీన్ క్రియేట్ చేసినట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.

Sukumar is planning for Pushpa 3 with base Baahubali Kattappa concept
Pushpa 2

బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది ఎవరికీ అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు దేశవ్యాప్తంగా… చాలామంది దీని గురించి చర్చించుకోవడం జరిగింది. అయితే సెకండ్ పార్ట్ అద్భుత రీతిలో రావటంతో అతిపెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఇదే తరహాలో సుకుమార్ రెండో భాగంలో ఆ కొత్త క్యారెక్టర్ తో.. బాహుబలి కట్టప్ప ఫార్ములతో..”పుష్ప 3″ స్క్రిప్ట్ కి పునాదులు వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు భారీగా వస్తూ ఉన్నాయి. “KGF”..కి సీక్వెల్ కంటిన్యూగా “KGF 2” రావటం అనేక రికార్డులు బ్రేక్ చేయడం తెలిసిందే. అంతకుముందు “బాహుబలి” తర్వాత “బాహుబలి 2” వచ్చి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు బ్రేక్ చేయడం మనకు అందరికీ తెలుసు. ఆ రీతిగానే “పుష్ప”, “పుష్ప 2”, “పుష్ప 3” కి సుకుమార్ ప్లానింగ్ చేసినట్లు ఫిలింనగర్ టాక్.


Share

Related posts

ఈ పోటోలో ఉన్న తారను గుర్తుపట్టరా!

Teja

అల్ల‌రి న‌రేశ్ కొత్త చిత్రం

Siva Prasad

గ‌ప్‌చుప్‌గా పూర్ణ పెళ్లి.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు!

kavya N