NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో..”RRR” తో… దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. సినిమా రిలీజ్ అవ్వకపోయినా గాని ఎన్టీఆర్ నటన కీర్తి వైభవం.. దర్శకుడు రాజమౌళితో పాటు తోటి నటుడు రామ్ చరణ్ చేసిన కామెంట్లు ఎన్టీఆర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. పాన్ ఇండియా నేపథ్యంలో సరైన సినిమా తారక్ కి పడితే తిరుగు ఉండదని చాలా మంది అంటున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్లో 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కూడా పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఉప్పెన మూవీ డైరెక్టర్.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తో… ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్టీఆర్ చేస్తున్నట్లు వార్తలు ఇటీవల విన్నాం. అయితే చిన్న లైన్ చెప్పక దానిని తారక్ పూర్తిగా.. స్టోరీగా మలిచాలని చెప్పడంతో బుచ్చిబాబు.. కథ సిద్ధం చేసి.. ఎన్టీఆర్ కంటే ముందుగా సుకుమార్ కి స్టోరీ వినిపించినట్లు.. ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్ లో.. స్క్రిప్టు ఉండేలా ఎన్టీఆర్ నీ.. నెవర్ బిఫోర్ గా ఎన్నడు చూడలేని రీతిలో బుచ్చిబాబు ఎన్టీఆర్ క్యారెక్టర్ రాసినట్లు.. స్క్రిప్ట్ వెన్న సుకుమార్ ఆర్ ఆర్ చర్య పోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కొరటాల శివ తర్వాత త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో మరోపక్క తారక్ ఉన్నట్లు సమాచారం. దాదాపు రెండు సంవత్సరాలలో కనీసం ఐదు సినిమాలైనా విడుదల చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.