Pushpa 2: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ ఏడాది మార్చి నెలలో వచ్చిన “RRR” ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. బాహుబలితో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన జక్కన్న “RRR”తో మరోసారి ఆకట్టుకున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది టెక్నీషియన్లు “RRR” సినిమా యూనిట్ ని పొగడటం జరిగింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ పులితో ఫైట్ టేకింగ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు ఇదే తరహా ఫైట్ సీన్.. డైరెక్టర్ సుకుమార్ “పుష్ప 2″లో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ నెల నుండి పుష్ప సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫైట్ సీన్ చిత్రీకరించడానికి సినిమా యూనిట్ థాయిలాండ్ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త తెలుసుకుని బన్నీ ఫ్యాన్స్..”RRR” ఫైట్ మాదిరిగానే ఇది కూడా హైలెట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “పుష్ప” మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది.
ఇండియాలో రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. దీంతో “పుష్ప 2” మరింత బ్లాక్ బస్టర్ అయ్యేలా సుకుమార్ మరియు బన్నీ చాలా శ్రద్ధ పెట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో పాత్రలకు సంబంధించి స్క్రీన్ టెస్ట్ లు జరుగుతున్నాయి. ఈ టెస్ట్ లు మొత్తం కంప్లీట్ అయినా వెంటనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!