32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Sukumar Prabhas: సుకుమార్… ప్రభాస్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..!!

Share

Sukumar Prabhas: సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ఓ వార్త రావడం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. సలార్, ఆది పురుష్, ప్రాజెక్టు కె, మారుతి సినిమా. ఈ నాలుగు ప్రాజెక్టులు అయినా వెంటనే సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టు ఓకే చేసినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ సినిమాని నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వచ్చిన వార్తలపై నిర్మాత స్పందించి.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.

Image

సుకుమార్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా గురించి వస్తున్నావని అవాస్తవాలే. ప్రస్తుతం ప్రభాస్ కమిటీ అయిన సినిమాలు కంప్లీట్ కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.. అని నిర్మాత అభిషేక అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా లేనట్టే అని అభిమానులు డిసైడ్ అయ్యారు. నిజంగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే అదిరిపోతుందని.. రావాలని మరి కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్…”పుష్ప 2″ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Prabhas gives his nod to Sukumar? | Prabhas and Sukumar News

“పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగం మరింత సూపర్ డూపర్ హిట్ చేయడానికి.. దాదాపు పది నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ పై సుకుమార్ కూర్చోవడం జరిగింది. వాస్తవానికి “పుష్ప” గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ అయింది. ఆ తర్వాత రెండో భాగం ఈ ఏడాది వ్యాసవిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ తో… సుకుమార్ ప్లాన్ మొత్తం మార్చి మరింత శ్రద్ధ పెట్టి స్క్రిప్ట్ చేంజ్ చేసి సరికొత్తగా ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ తో సుకుమార్ చేసే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలు.. అవాస్తవమని తాజాగా నిర్మాత తెలియజేయడం జరిగింది.


Share

Related posts

Rashmi Gautam: వైరల్ గా మారిన యాంకర్ రష్మి గౌతమ్ ఫొటోస్..!

Teja

Pawan Kalyan: ట్రెండీ టాక్‌.. ఆ రీమేక్‌ను మూడు వారాల్లో ముగించ‌బోతున్న ప‌వ‌న్‌

kavya N

Shriya Saran Beautiful Wallpapers

Gallery Desk