చిరు 153కి డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?


మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ..కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా ప్రారంభం కాక‌మునుపే చిరు 153వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన లూసిఫ‌ర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవి న‌టించ‌నున్నాడు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే కొర‌టాల శివ చిత్రం పూర్త‌యిన త‌ర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో చ‌ర‌ణ్ కూడా న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.