న్యూస్ సినిమా

Pushpa: పుష్ప సినిమా కోసం రాజమౌళి టెక్నిక్ వాడుతున్న సుకుమార్..!!

Share

Pushpa: డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో “పుష్ప” సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావటం మాత్రమేకాక ఇటీవల “పుష్ప” మొదటి పార్టు చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు సన… పది “కేజిఎఫ్” సినిమా లు కలిపితే ఒక “పుష్ప” సినిమా అవుతుందని  స్టేట్ మెంట్ ఇవ్వటంతో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.

Another Female Character in Allu Arjun's Pushpa?

మొదటి పార్ట్ ఓ రేంజ్ లో ఉందని టాక్ ఇప్పటికే రావటంతో బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ అని చెప్పటంతో బన్నీ అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా… రెండో పార్ట్ విషయంలో సుకుమార్.. రాజమౌళి టెక్నిక్ వాడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్త కొత్తగా ఒకటి వైరల్ అవుతుంది.

Read More: Pushpa: పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటించే ప్రాజెక్ట్ ల వివరాలు..!! 

మేటర్ లోకి వెళ్తే “పుష్ప” మొదటి భాగం రిలీజయ్యాక ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి.. పుష్ప రెండో భాగం స్టోరీ లో మార్పులు చేర్పులు చేయాలని అప్పటి వరకు రెండో భాగం స్క్రిప్ట్ టచ్ చేసే ఆలోచనలు సుకుమార్ కి లేనట్లు తెలుస్తోంది. “పుష్ప” మొదటి భాగానికి మంచి టైమింగ్ రావడంతోపాటు.. సినిమాలో  ప్రతి ఫ్రేం.. కళ్లు చెదిరే రీతిలో ఉండేలా సుకుమార్ డిజైన్ చేయడం జరిగిందట. దీంతో మొదటి పార్ట్  “పుష్ప” రిజల్ట్ బట్టి సెకండ్ పార్ట్ “పుష్ప” స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేయాలా వద్దా అనే రీతిలో సుకుమార్ ఉన్నట్లు సమాచారం.


Share

Related posts

ప్రియాంక హత్య: సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

somaraju sharma

క్షణాల్లో బూడిదైన బస్సు ఎక్కడో తెలుసా?

Teja

Wrestler: ఘర్షణలో రెజ్లర్ మృతి!మిస్టరీగా మారిన ఘటన!ఒలింపిక్ మెడలిస్టుపై అనుమానాలు!!

Yandamuri