Suma: సరిగ్గా భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక్కరోజు ముందు బండ్ల గణేష్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరో ఒక అభిమాని బండ్లకి ఫోన్Suma: సరిగ్గా భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక్కరోజు ముందు బండ్ల గణేష్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరో ఒక అభిమాని బండ్లకి ఫోన్ చేసి, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారా లేదా అని అడిగితే, బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ పేరు ఉటంకిస్తూ నన్ను ఈవెంట్ కు రానివ్వడం లేదు అంటూ చేసిన కామెంట్లు అప్పట్లో పెను దుమారాన్నే సృష్టించాయి. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారం మెల్లిగా మర్చిపోయారు అనుకోండి. అయితే తాజాగా F3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో సుమ ఈ వ్యవహారాన్ని మరోసారి తెరమీదకు తీసుకు వస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి, షాక్ ఇచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Suma: ఏ సందర్భంలో మాట్లాడింది?
మే 27వ తేదీన F3 సినిమా విడుదల కాబోతున్న క్రమంలో ఒక వారం ముందు అంటే ఇరవై ఒకటో తేదీనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ ఓ సందర్భంలో బండ్ల గణేష్ భీమ్లా నాయక్ కుట్ర వ్యవహారాన్ని బయట పెట్టేసింది. పూర్తిస్థాయి తెలంగాణ యాస, కాస్త ముస్లిం వారు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా సుమ నడిపించింది. భీమానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ గారిని ఎలా అయితే వెళ్లకుండా కుట్ర చేశారో తనను కూడా ఎఫ్ త్రీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళకుండా చేశారు అంటూ ఆమె ఓ ఫన్నీ సందర్భంలో ఆరోపించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బండ్ల విషయం నిజమేనా?
ఇకపోతే, తాజాగా సుమ మాట్లాడిన మాటల వీడియోను బండ్ల గణేష్ సైతం తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు శేఖర్ చంద్ర దర్శకుడిగా వ్యవహరించగా కథ స్క్రీన్ ప్లే వంటి విషయాలలో మాత్రం త్రివిక్రమ్ శ్రద్ధ తీసుకున్నాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ వేడుకకు దూరంగా ఉండటం కొసమెరుపు. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని బండ్ల గణేష్ వ్యవహారం మాత్రం ప్రస్తుతం మరలా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.