సినిమా

Varun Tej-Sunil: రష్యన్ సినిమాలో వ‌రుణ్ తేజ్‌.. వైర‌ల్‌గా మారిన సునీల్ కామెంట్స్‌!

Share

Varun Tej-Sunil: ఇటీవ‌లె `గ‌ని`తో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.. ఇప్పుడు `ఎఫ్ 3`తో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేష్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేశారు. అలాగే సునీల్‌, సోనాల్ చౌహాన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రం `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `ఎఫ్ 3`ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్మిస్తున్నారు.

ఇందులో భాగంగా సునీత్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. `ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి గట్టిగా నవ్వుకొని, మళ్ళీ వెళ్దాం అనుకునే సినిమా ఎఫ్ 3`. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో ఉంటుంది. నాన్ స్టాప్ నవ్వులే` అంటూ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు.

అయితే ఈ క్ర‌మంలోనే సునీల్ వ‌రుణ్ తేజ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `వరుణ్ తేజ్ అప్పియరెన్స్ చుస్తే రష్య‌న్‌ సినిమాలో కూడా హీరోగా పెట్టేయొచ్చు. హాలీవుడ్ కటౌట్ ఆయనది. అలాంటి వరుణ్ గారు.. ఎఫ్ 3లో ఒక మిడిల్ క్లాస్ రోల్ చేయడం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న చాలా మంచి వారు. న‌న్ను అన్నా అని పిలుస్తారు. వరుణ్ గారిలో ఎంతో ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది.` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సునీల్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాగా.. మెగా ఫ్యాన్స్ తెగ ఉప్పింగిపోతున్నారు


Share

Related posts

నాలుగు గెట‌ప్స్‌లో కంగ‌నా!

Siva Prasad

సంజ‌య్‌ద‌త్‌కు కోర్టు నోటీసులు

Siva Prasad

Tatineni Ramarao: సినీ డైరెక్టర్ తాతినేని కన్నుమూత

somaraju sharma