NewsOrbit
సినిమా

Sunil: F3 లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి: సునీల్

Sunil: కమెడియన్ సునీల్ అంటే తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పాలి. తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నాడు. బ్రహ్మానందం.. ఎమ్మెస్ వంటి వారు బరిలో ఉన్నప్పుడే సునీల్ తానేమిటనేది సత్తా చాటాడు. ఆ తరువాతి క్రమంలో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత మళ్లీ కమెడియన్ గా బిజీ కావడానికి ఇపుడు ప్రయత్నిస్తూ వున్నాడు. ఈ లోగా చేతికి అందిన విలక్షణమైన పాత్రలను సైతం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో చేసిన పుష్ప సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర సునీల్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

Sunil Says Movies like F3 rarely come out
Sunil Says Movies like F3 rarely come out

F3 విశేషాలు:

సునీల్ ఓ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘F 3’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి సునీల్ ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.. “నాకు చాలా ఇష్టమైన దర్శకులలో అనిల్ ఒకరు. తనతో వర్క్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను. ఆర్టిస్ట్ టైమింగ్ కి తగినట్టుగా చెప్పడం ఆయన స్పెషాలిటీ. యాక్షన్.. కామెడీ ఇలా ఏదైనా తాను అద్భుతంగా తీసి చూపిస్తాడు. ఈ సినిమాలో ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు. అయినా ఎవరికీ ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే ఎవరి ప్లేస్ వారికుంటుంది. మళ్లీ ఆయనతో కలిసి ఎప్పుడు చేస్తానా అని ఎదురుచూసేంతగా చేస్తాడు.” అని చెప్పుకొచ్చాడు.

Sunil Says Movies like F3 rarely come out
Sunil Says Movies like F3 rarely come out

F3 ఓ అరుదైన సినిమా:

ఇంకా సునీల్ మాట్లాడుతూ… “ఈ సినిమా కోసం మొత్తం 16 కారవాన్లు ఉండేవి. చూడటానికి ఓ బస్ డిపోలా ఉండేది. దీనిని బట్టి ఎంతమంది ఆర్టిస్టుల ఉన్నారో మీరు అర్ధం చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఇంతమంది ఆర్టిస్టులను పెట్టి.. ఇంతటి ఫన్ ను అందించే సినిమా ఇప్పట్లో రాదనే చెప్పుకోవాలి. చాలా కాలం తరువాత ఇక పూర్తిస్థాయి కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాతో ప్రేక్షకులు మళ్ళీ పాత సునీల్ ని చూస్తారు. నాది గ్యారంటీ. ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చిన దిల్ రాజుగారికి .. అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని ముగించారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu